కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
బాలికల గిరిజన గురుకులంలో హరితహారం షురూ
హాజరైన కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ఆసిఫాబాద్‌టౌన్, జూలై1 : వనాల పెంపుతోనే మానవ మనుగడ ముడిపడి ఉంటుందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన గురుకులంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఏడో విడుత హరితహారంలో భాగం గా గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లా డుతూ మొక్కల సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, జిల్లా అధికాడరులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మానిక్ గూడలో హరితహారం..
మండలంలోని మానిక్ గూడలో జిల్లా మద్యపాన నిషేధ శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాజ్యలక్ష్మి 100 ఈత మొక్కలు నాటారు. సీఐ మోసిన్ అలీ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికే పల్లెప్రగతి: ఎమ్మెల్యే కోనప్ప
కాగజ్‌నగర్ రూరల్, జూలై 1: గ్రామాల అభివృద్ధికే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని ఈస్గాంలో గురువారం పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమస్యలను గుర్తించి పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. అంతకుముందు మూడో విడుత పల్లె ప్రగతిలో చేపట్టిన ఫొ టో ఆల్బమ్‌ను ఎమ్మెల్యేకు సర్పంచ్ చూపించారు. అనంతరం పం చాయతీ ఆవరణలో మొక్క నాటారు. జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ చీపురుశెట్టి శంకర్, కోఆప్షన్ స భ్యుడు సిద్ధిఖీ, ఎంపీటీసీ కుమార్, వైస్ ఎంపీపీ స్వదేశ్ శర్మ, అధికారులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి : జడ్పీ సీఈవో రత్నమాల
కౌటాల, జూలై 1 : పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో రత్నమాల అన్నారు. పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ వొజ్జల మౌనిశ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్హ్రిత మండలం గా తీర్చిదిద్దుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో మొక్క నాటారు. మండల కేంద్రంలోని ప్రకృతి వనాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు పరిశీలించి రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమం లో డీఆర్డీఏ ఏపీడీ కుటుంబరావు, ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, ప్రత్యేకాధికారి సీపీవో రవీందర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంత య్య, తహసీల్దార్ మునావర్ షరీఫ్, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, ఎంపీ వో శ్రీధర్ రాజు, ఏఈ రవీందర్, ఎఫ్‌బీవో ప్రభాకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కావ్య, ఉపసర్పంచ్ పసునూరి తిరుపతి, సబ్ ఇంజినీర్ అజయ్, ఎల్ఐ మాధవ్, కార్యదర్శి సాయికృష్ణ, కారోబార్ భా స్కర్, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
చింతలమానేపల్లి, జూలై 1 : మండలంలోని ఆడెపల్లిలో ఎమ్మెల్యే కోనప్ప , కోర్సిని, బూరెపల్లి, రన్వెల్లి గ్రామాల్లో జడ్పీ సీఈవో రత్నమాల అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీవో కుటుంబరావు, ఇన్చార్జి ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, కోఆప్షన్ సభ్యుడు నాజీం హుస్సేన్, సర్పంచ్‌లు కొడిపె శ్యామల, సోమేశ్, గణపతి, ఏపీవో రాజన్న, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, కార్యదర్శులు తిరుపతమ్మ, సందీప్, అనూష, ఉప సర్పంచ్ సంతోష్‌గౌడ్, నాయకులు రషీద్, దివాకర్, గ్రామస్తులుఉన్నారు.
బెజ్జూర్, జూలై 1 : మండల కేంద్రంలో ఎంపీపీ డోకె రోజారమణి బెజ్జూర్‌లో చేపట్టిన పనులను పరిశీలించారు. సర్పంచ్ అన్సార్ హు స్సేన్ ప్రధాన రహదారి గుంతల్లో మొరం పోయించారు. ఎంపీడీవో రమేశ్ రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
దహెగాం, జూలై 1: మండలంలోని కమ్మర్పల్లి, గెర్రె, గిరివెల్లి గ్రా మాల్లో ఎంపీపీ కంభగౌని సులోచ, జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు శ్మశాన వాటికలను ప్రారంభించడంతో పాటు మొక్కలను నాటారు. దహెగాం, ఒడ్డుగూడ, చిన్నరాస్పల్లి, తదితర గ్రామాల్లో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్‌గౌడ్, స ర్పంచ్‌లు పుప్పాల లక్ష్మి, జర్పుల శ్యామల, దందెర అమ్మక్క, సందికట్ల రమేశ్, కారు రాజన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్, మండల ప్రత్యేకాధికారి సాంబశివరావు ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో రాజేశ్వర్‌గౌడ్, ఏపీవో చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి), జూలై 1 : పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ తోట మహేశ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. సమావేశంలో ఎంపీపీ చునార్కర్ సువర్ణ, జడ్పీటీసీ నీరటి రేఖ, ఎంపీడీవో రాజేశ్వర్, ఇన్చార్జి ఎంపీవో కృష్ణమూర్తి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.అదేవిధంగా వేంపల్లి గ్రామంలో వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణ ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు.
రెబ్బెన,జూలై1: రెబ్బెన, గోలేటి, నంబాల, గంగాపూర్తో పాటు పలు గ్రామాల్లో గురువారం గ్రామసభలు ఏర్పాటు చేసి, ర్యాలీలు తీశారు. ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, సర్పంచ్‌లు చెన్న సోమశేఖర్, పోటు సుమలత, బొమ్మినేని అహల్యాదేవి, పందిర్ల వినోద, ఎంపీటీసీ పెసరి మధునయ్య, ఉపసర్పంచ్లు బొదాసు దేవానంద్, మడ్డి శ్రీనివాసగౌడ్, ప్రత్యేకాధికారి ర బ్బానీ, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీవో అంజాద్పాషా, పంచాయతీ కార్యదర్శులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
లింగాపూర్, జూలై 1: మండల కేంద్రంలో ఎంపీపీ ఆడే సవిత ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. అనంతరం చేపట్టనున్న పనులపై తీర్మానం చేశారు. మొక్కలు నాటాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్ర జలకు సూచించారు. ప్రత్యేకాధికారి శేషారావ్, ఎంపీడీవో ప్రసాద్, వైస్ ఎంపీపీ ఆడే ఆత్మారాం, ఎంపీవో ఉమ్మర్ షరీఫ్ పాల్గొన్నారు. కెరమెరి, జూలై 1: ఎంపీడీవో కార్యాలయం రహదారికిరువైపులా ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి మొ క్కలు నాటారు. అదేవిధంగా సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి పలు సమస్యలపై చర్చించి తీర్మానం చేశారు. ఏపీవో నగేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాథోడ్ ఉత్తం నాయక్, సర్పంచ్ లు, నాయకులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
జైనూర్, జూలై 1: మండలంలో మొదటి రోజు గ్రామసభలు నిర్వహించారు. జైనూర్ పంచాయతీ కార్యాలయంలో సమావేశంలో ఎంపీపీ కుమ్ర తిరుమల పాల్గొని మాట్లాడారు. కూరగాయాల సంత ను మార్కెట్ యార్డులో నిర్వహించాలని తీర్మానం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా, ఎంపీడీవో ప్రభు ద యా, డిప్యుటీ రేంజ్ అధికారి ప్రియంకా చౌహాన్, ఎఫ్ఎస్వో గులా బ్, వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఫిరో జ్‌ఖాన్, సీనియర్ నాయకుడు మెస్రం అంబాజీ, సర్పంచ్‌లు పార్వతీలక్ష్మణ్, మడావి భీంరావ్, సిడాం భీంరావ్, గోవింద్‌రావ్, నాయకులు షేక్ అబ్బు, అజ్జులాలా, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులున్నారు.
పెంచికల్పేట్, జూలై 1 : మండలంలోని లోడ్పల్లిలో ఎంపీపీ జా జిమొగ్గ సుజాత మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, వైస్ ఎంపీపీ చౌదరి కమల, మం డల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సాజీద్, ఎంపీటీసీలు దూగుంట రాజన్న, శారద, సర్పంచ్‌లు సంజీవ్, రాజన్న, సుజాత, జాజిమొగ్గ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కౌటాల రూరల్, జూలై 1 : ముత్తంపేటలో గ్రామ సభ నిర్వ హించారు. మండల ప్రత్యేకాధికారి రవీందర్, ఎంపీడీవో హాజరయ్యారు. అనంతరం వారు మొక్కలు నాటారు. ఎంపీడీవో శ్రీధర్ రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ కావ్య పాల్గొన్నారు.