సంస్థ డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) బలరాం
శ్రీరాంపూర్ ఓసీపీలో రూ. 80 కోట్లతో ఇన్ఫిట్ క్రషర్ కంట్రోల్ సిస్టం ప్రారంభం
శ్రీరాంపూర్, జూలై 1 : కార్మికుల కృషితోనే సింగరేణి అభివృద్ధి చెందుతున్నదని సంస్థ డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్ ) బలరాం అన్నారు. శ్రీరాంపూర్ ఓసీపీలో రూ. 80 కోట్లతో ఏర్పాటు చేసిన ఇన్ఫిట్ క్రషర్ సిస్టం, బెల్టె కన్వేయర్ సింస్టంను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్ట్ కన్వేయర్ ద్వారా ఓసీపీ క్వారీ నుంచి 3.5 కిలో మీటర్ల పైకి, కోల్లోడింగ్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ) వరకు బొగ్గు రవాణా జరుగుతుందన్నారు. దీంతో సంస్థకు ముఖ్యంగా డీజిల్‌తో పాటు వాహనాల రవాణా తగ్గుతుందన్నారు. రోజుకు 3 రేకులకు బదులు 4 రేకుల బొగ్గు రవాణా చేయవచ్చన్నారు. సింగరేణిలో మొదటిడోస్ వ్యాక్సినేషన్ 95 శాతం పూర్తయ్యిందని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం శ్రీరాంపూర్ ఏరియా జూన్‌లో 103 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడంపై జీఎం సురేశ్, కార్మికులను, నాయకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, జీఎం సురేశ్, ఈఈ కుమార్, ఎస్వోటూ జీఎం కేహెచ్ఎన్ గుప్తా, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గోసిక మల్లేశం, డీవైజీఎం గోవిందరాజు, ఎన్ రమేశ్, చిరంజీవులు, పీవోలు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్షణ్, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, సీనియర్ పీవో శంకర్, ఈఈ శ్యాంసుందర్, ఓసీపీ సేఫ్టీ ఆఫీసర్ వీరయ్య, నాయకులు మల్లెత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.