కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
కాగజ్నగర్ టౌన్, జూన్ 30 : పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్క రూ భాగస్వాములు కావాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మున్సిపల్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వరుణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్, కౌన్సిల్ సభ్యులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 1నుంచి 10 వ తేదీ వరకు పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పట్టణంలో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైనేజీ రో డ్లు, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్య లు తీసుకోవాలన్నారు. రోడ్డుకిరువైపులా కాలనీ ల్లో, ప్రభు త్వ స్థలాలను గుర్తించి మొక్కలను నాటి హరిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని సూచించా రు. నాటిన మొక్కలను పరిరక్షించేందుకు జియోట్యాగింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తుంటారని, ప్రతీ మొక్క బతికేలా చూడాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి మాట్లాడుతూ 10 రోజుల పాటు రోజుకో కార్యక్రమం చేపట్టాలన్నా రు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఇం టింటా చెత్తసేకరణ చేసి మెప్మా సిబ్బంది, అధికారులు తడి, పొడి చెత్తపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణ ప్రగతి టీం మెంబర్లు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అ నంతరం మున్సిపల్ ఛైర్మన్ సద్దాం హుస్సేన్ మా ట్లాడుతూ కౌన్సిలర్లు పట్టణ ప్రగతిని విజయవం తం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఆర్వో బాపు, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.