బేల : మండలంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిర్సన్న గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలు చెరువుల తలపిస్తున్నాయి. అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణ (Incomplete bridges) పనులతో నీరు పంటపొలాల్లో చేరి నిలువు ఉంటున్నాయని ఖరీఫ్ ( Kharif ) పనులు ఎలా చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అంతరాష్ట్ర రహదారి 353 బ్రిడ్జి నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నీరు మొత్తం రైతుల పొలంలో చేరి చెరువుల తలపిస్తున్నాయని రైతులు వాపోయారు. బ్రిడ్జి పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల పొలంలో ఉన్న బోరుబావి కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్ సాగు కోసం విత్తనాలు విత్తడానికి సిద్ధం కావాల్సిన తరుణంలో పొలంలో వరద నీరు చేరడంతో పనులు ఎలా ప్రారంభించాలని ప్రశ్నిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు గుత్తేదారు వెంటనే పూర్తి చేయాలని, లేకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.