నార్నూర్, జనవరి 15 : దశాబ్దాల చరిత్ర గల ఖాందేవుడి మహిమ చాలా గొప్పదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదిలాబా ద్ జిల్లా నార్నూర్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ ఖాందే వ్ జాతర మహాపూజతో మంగళశారం వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం పుణ్యక్షేత్రంలో తైలం తాగించే మహోన్నత కార్యక్ర మం నిర్వహించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మహారాష్ట్రలోని కేలాపూర్ ఎమ్మెల్యే తొడసం రాజులు పాల్గొన్నారు. సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయ సన్నిధిలో పూజలు చేశారు. ఆ వంశీయులు ఇంటి వద్ద తయారు చేసిన శుద్ధమైన మూడు కిలోల నువ్వుల నునెను తాగారు. మెస్రం వంశం ఆడబిడ్డ, కటోడా ఖాందేవ్ ప్రతిమలకు నైవేద్యం గా సమర్పిస్తూ మొక్కలు చెల్లించుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితీ తాలుకా కొద్దేపూర్ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి తమ ఇష్టదైవాన్ని తలచి విశ్వశాంతిని కోరుతూ మూడు కిలోల తైలం తాగి దైవభక్తిని చాటుకున్నది.
వారి ఆచారం ప్రకారం మూడేళ్లపాటు తైలంగా తాగి మొక్కును ము గించుకున్నది. ఆడబిడ్డ దంపతులను నూతనవస్ర్తాలతో సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మినీ దర్బార్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. సృష్టిలోని ఏ దేవస్థానంలో ప్రత్యక్షంగా నూనె తాగే ఆచారాన్ని చూడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి తొడసం భీంరావ్, కటోడాలు తొడసం బాపురావ్, తొడసం ఆ నంద్రావ్, తొడసం రాజుపటేల్, పాండు ప టేల్, ఆదివాసీ జేఏసీ మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ మాజీ చైర్మన్ తొడసం నాగోరావ్, సర్పంచ్ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు ఉర్వేత రూప్‌దేవ్, రాయి సెంటర్ జిల్లా సార్మెడి మెస్రం దుర్గు పటేల్, ఉపాధ్యాయులు మెస్రం శేఖర్‌బాబు, మెస్రం లింగు పాల్గొన్నారు.