బేల, డిసెంబర్ 4 : జైనథ్ మండలం కామాయి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ఇటీవల రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా, తరోడ గ్రామానికి చెందిన మాలేకర్ ప్రవీణ్‌కుమార్ జిల్లా కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. వారిని ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, నాయకులు శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, నాయకులు ప్రశాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, అశోక్, సర్పంచ్ విఠల్‌రెడ్డి, మహేందర్‌యాదవ్ పాల్గొన్నారు.