జన్నారం, నవంబర్ 23 : సేవాలాల్ ఆశీస్సులతో కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) సినిమా వంద రోజులు ఆడాలని ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్‌నాయక్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర సినిమా హాల్లో ప్రదర్శించిన చిత్రాన్ని నిర్మాత రాకేశ్, డైరెక్టర్ గరుడ అంజి, బృందం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తిలకించారు. అంతకు ముందు స్థానిక అంగడిబజార్ చౌరస్తా నుంచి సినిమా హాల్ వరకు చిత్ర బృందం సభ్యులకు డప్పు చప్పుళ్ల నడుమ ఘన స్వాగతం పలికారు.
వారు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని వర్గాల వారు చూడాల్సిన సినిమా అని, రాష్ట్రం రాకముందు.. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రేక్షకులకు కళ్లకుకట్టినట్లు చూపించారని చిత్ర బృందాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శీలం రమేశ్, మాజీ ఎంపీపీ మాదాడి సరోజన, నాయకులు పూర్ణచందర్‌నాయక్, సిటిమల్ల భరత్‌కుమార్, మున్వర్ అలీఖాన్, ఫజల్, సులువ జనార్దన్, శ్రీనివాస్‌గౌడ్, నర్సాగౌడ్. జబర్ధస్త్ యాక్టర్ సుజాత పాల్గొన్నారు.