మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) పుట్టిన రోజు వేడుకలను సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. శతమానం భవతి, వెయ్యే ళ్లు వర్ధిళ్లు అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం, సాధించుకున్న స్వరాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. నిండు నూరేండ్లు జీవించాలని, మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వాడవాడన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఇంట్లో కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్నదానం చేశా రు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు పాల్గొన్నారు. నస్పూర్‌లో టీబీజీకేఎస్ నాయకులు మొక్కలు నాటారు. దండేపల్లి, జన్నారం మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజారమేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేశారు. శివాలయంలో ప్రత్యేక పూజలు, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నూ ర్ బస్టాండ్‌లో అన్నదానం చేశారు. మందమర్రి, జైపూర్, రామకృష్ణాపూర్లో వేడుకలు జరిగాయి. బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్థానిక కొదండ రా మాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు.
బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలంలో ఎమ్మె ల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా రక్తదానం చేయగా, 708 మంది బీఆర్ఎస్ నాయకులు, యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి, శివాలయంలో అన్నదానం చేశారు. జైనథ్ మండల కేంద్రంలో మొక్కలు నాటారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ ఇన్‌ఛార్జి రాంకిషన్‌రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఖానాపూర్లోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ మొక్కలు నాటారు. భైంసాలో బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు రమాదేవి నివాసంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. భైంసా ఏరియా ఆసుపత్రిలో స్థానిక బీఆర్ఎస్ లీడర్లు పండ్లు పంపిణీ చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. దాదాపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
తెలంగాణ జాతిపిత కేసీఆర్
తెలంగాణ జాతిపిత కేసీఆర్ పదేండ్ల బీఆర్ ఎస్ పాలనలో సంక్షే మ, అభివృద్ధి పథకాల ను అమలు చేసి దేశం లోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపారు. నాడు రైతుల ఆత్మహత్యలను చూసి చలించిన కేసీఆర్.. వాటిని నివారించేందుకు ప్రతి ష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి పదకొం డు విడుతల్లో రూ.75 వేల కోట్లను అందజేసి ఆదుకు న్న ఘనత ఆయనకే దక్కింది. కేసీఆర్ ప్రభుత్వం వ్యవ సాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంటు ఇవ్వ డం వల్లనే రాష్ట్రంలోని రైతులు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించగలిగారు. కల్యాణలక్ష్మి, షాదీ ము బారక్ పథకాలను అమలు చేసి ఆర్థికంగా ఆదుకున్న ఘనత కూడా ఆయనదే. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిం ది. ఆడ పిల్లల పెళ్లికి తులం బంగారం ఇస్తామని చెప్పి ఏడాది దాటినా దాని ఊసేలేదు. అలాగే రూ.4 వేల పింఛన్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశాడు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో 450కి పైగా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రు. వ్యవసాయానికి కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరే కత కనిపిస్తున్నది. ప్రజలు మళ్లీ కేసీఆరే రావాలని బలంగా కోరుకుంటున్నరు. ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ నాలుగు కాలాలపాటు చల్లగా ఉండాలని ఆ భగవం తుడిని ప్రార్థిస్తున్నాం.
– డాక్టర్ పడకంటి రమాదేవి,ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త
రైతుబంధువు కేసీఆర్..
రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువరు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి రైతుబంధువుగా కేసీఆర్ నిలిచారు. రాష్ట్ర సాధకుడిగానే కాకుండా పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కింది. రాష్ట్రంలోని అనేక తండాలను పంచాయతీ లుగా మార్చి పది శాతం రిజర్వేషన్ పెంచి గిరిజనుల గుండెల్లో నిలిచారు. పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇంత త్వరగా ప్రజా వ్యతిరేకత, ఆగ్రహాన్ని మూటగట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆరే సీఎం. – భూక్యా జాన్సన్ నాయక్,ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి.
తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్
తెలంగాణను సాధించిన కేసీఆర్ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన మాట్లాడారు. తమ ప్రాణాలకు లెక్క చేయకుండా రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు మోసపూరిత హామీలిచ్చారని, 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నాయకులు మెట్టు ప్రహ్లాద్, అజయ్, నారాయణ, యూనిస్ అక్బానీ, సాజిదుద్ద్దీన్, స్వరూపరాణి, కరుణ, మమత, పరమేశ్వర్, దమ్మపాల్, కొండ గణేశ్, పవన్ నాయక్, పందిరి భూమన్న, దేవిదాస్, అయ్యుబ్, విఠల్ పాల్గొన్నారు.
– జోగు రామన్న, మాజీ మంత్రి
కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు..
రాష్ట్ర ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండలో నిర్వహించిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొని రక్తదానం చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తదాన శిబిరానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానుల తరలిరావడం కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శమని తెలిపారు.
– అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్.