శ్రీరాంపూర్, మే 9 : ఉద్యమ స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చా రు. శుక్రవారం శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ-3 గనిపై ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. సింగరేణిలో కేసీఆర్ వల్లే నేడు యువ కార్మికులు నిండుకున్నారని, 20వేల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. సింగరేణి సంస్థ ఉన్నంత వరకూ కేసీఆర్‌ను యువ కార్మికులు మరిచిపోలేరన్నారు. 15 వేల మంది కారుణ్యం ద్వారా, 5 వేల మంది ఎక్స్టర్నల్ నోటీఫికేషన్ ద్వారా పనిచేస్తున్నారన్నారు. కారుణ్య ఉద్యోగాలు లేకుంటే ఈ రోజు సంస్థలో కేవలం 20వేల మంది మాత్రమే ఉండేవారన్నారు.
నాడు పోరాడి తెలంగాణ సాధించుకున్న వీరులే.. నేడు సింగరేణి కార్మికులుగా ఉన్నారని చెప్పారు. కేంద్రం గనులను ప్రైవేటీకరించాలని చూస్తే కేసీఆర్ సర్కారు తిప్పికొట్టిందన్నారు. తిరిగి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై గనుల వేలానికి పాల్పడుతున్నదని, యువ కార్మికులు ఉద్యో గ భద్రత కోసం పోరాటం చేయాలని, ఈ నెల 20న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం కార్మిక చట్టాలు తొలగించి కేవలం 4 కోడ్లుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సింగరేణిలో ఓసీపీలు, గనుల్లో బొగ్గు ఉత్పత్తి.. రవాణా పనులు కార్మికులకే కల్పించాలని, కొత్త గనులు ఏర్పాటు చేయాలని, సిక్ లీవులు.. ఎన్‌క్యాష్‌మెంట్ కల్పించాలని, 2016 నుంచి పెరిగిన రూ. 20 లక్షల గ్రాట్యుటీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీరాంపూర్ ఎస్సార్పీ-3గనికి చెందిన వివిధ యూనియన్ల నాయకులు, కార్మికులు 100 మంది శుక్రవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సం ఘంలో చేరారు. యూనియన్‌లో చేరిన వినోద్, నరేశ్, సర్దార్ చంద్రశేఖర్, నాయకులు జగదీష్, దేవేందర్‌రెడ్డి, రమేశ్, రాజయ్య, బొడ్డు శంకర్, ఎస్ మొగిళి, శ్రీకాంత్, బాలకృష్ణ, అందె రమేశ్, ఆకాశ్, శ్రావణ్, బండారి సాయికిరణ్, గడుదాసు సాయికిషోర్, ఫయీమ్, దుర్గం వ శిష్ట, రాజిరెడ్డి, ఆనిల శివకృష్ణ తదితరులకు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్రెడి కండువాలు కప్పి సంఘంలోకి స్వాగతం పలికారు. డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్వేష్‌రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు ఎండ్ లాల, సాధుల భాస్కర్, గడ్డం మహిపాల్ రెడ్డి, బుస్స రమేశ్, గొర్ల సంతోష్, ఉత్తేజ్‌రెడ్డి, వెంగల కుమారస్వామి, పిట్ కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, రాజునాయక్, దుర్గం రవికుమార్, సహాయ కార్యదర్శులు నరేశ్, సల్మాన్, జైపాల్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి పవన్‌కల్యాణ్, నాయకులు తిరుపతిరెడ్డి, నిమ్మపూడి శ్రీనివాస్, గోపతి మల్లేశ్, సంగతి తిరుపతి, జంగా తిరుపతి రెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, గంగాధ ర్, సుభాష్, వినోద్, నరేశ్, బాలసా ని రమేశ్, అల్లం రాజయ్య, శంక ర్, దేవేందర్ రెడ్డి, జంగ సంతోష్ రెడ్డి, అనిరుధ్, సిరాజ్పాషా, గంగాధర్, సతీశ్‌యాదవ్, వెంకటేశ్, ప్రమోద్, తనువుల బాలు, సంతో ష్, గోదారి శ్రీధర్, మంకు కార్తీక్, ప్రశాంత్, కిరణ్, సందీప్ పాల్గొన్నారు.