జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం.. ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్ రూరల్ : పరమ శివుని దివ్యాశీస్సులు, లోక కల్యాణార్థం కోసం నవంబర్ 3న కార్తీక దీపోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో భారీఎత్తున కార్తీక దీపోత్సవాన్ని జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ నున్నట్లు ఎమ్మెల్యే జోగు రామన్న ప్రకటించారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో కార్తీక దీపోత్సవానికి సంబంధించిన పోస్టర్లను మహిళ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆరోజు సాయంత్రం 5.30గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దీనిలో పాల్గొనాలంటే ఎంట్రీ పాసులు తప్పనిసరని సూచించారు.
ఎంట్రీ పాసులు ఎమ్మెల్యేక్యాంపుకార్యాలయంలో లభిస్తాయన్నారు.ఇతర వివరాల కోసం సెల్‌నెం. 9701654673, 08732-295088లో సంప్రదించవచ్చని సూచించారు. మహిళలు పెద్దసంఖ్యలో మహా కార్తీక దీపోత్సవానికి తరలివచ్చి పరమ శిశుని కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రంలో మహిళపట్టణాధ్యక్షురాలు స్వరూపరాణి, కార్యదర్శి మమత, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించే డైట్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే జోగు రామన్న శనివారం పరిశీలించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

