కుభీర్ : పత్తి పంటకు మద్దతు ధర రావాలంటే ‘కపాస్ కిసాన్ మొబైల్ యాప్’ ( Kapas Kisan Mobile Aap) ను స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్‌లో చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని సారిక రావు( AO Sarika Rao ) సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని పత్తి మిల్లులో పత్తి తీసుకొచ్చిన రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. తేమ 12 శాతం ఉండేలా రైతులు ఆరబెట్టుకుని విక్రయానికి తీసుకురావాలన్నారు. ప్రస్తుతం ఎకరాకు 7 క్వింటాళ్లు తూకం వేస్తారని వివరించారు.
స్మార్ట్ ఫోన్ లేని రైతులు ఏఈఓ లను సంప్రదించాలని కోరారు. స్లాట్ బుక్ అయిన తేదీనాడు మిల్లుకు పత్తిని తీసుకొని రావాలన్నారు. పత్తి సాగు చేసిన రైతులు తమ ఫోన్ నెంబర్లు యాక్టివేషన్లో లేకపోతే ఏఈఓ లను సంప్రదించాలని కోరారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోలేని వారికి ఏఈవోలు రైతుల ఫోన్లో యాప్‌ను డౌన్లోడ్ చేస్తారని అన్నారు. ఏఈవోలు పత్తి రైతులకు అందుబాటులో ఉండి రైతులు నష్టపోకుండా చూసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వీణ, సీసీఐ సీపీవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.