 
                                                            తాండూర్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ ( Commemorate ) వారోత్సవాల సందర్భంగా శుక్రవారం తాండూర్ మండల కేంద్రం ఐబీ చౌరస్తా వద్ద పోలీసులు కళాజాత (Kalajata) ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా( Amber Kishore Jha) ఆదేశాల మేరకు కళాజాత బృందం సభ్యులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ తమ పాటల ద్వారా పోలీసుల కథనాలను, ప్రస్తుత పోలీసుల విధులను వివరించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సన్మార్గంలో పయనిస్తు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. మండంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులతో సహకరించాలని కోరారు. ప్రభుత్వాలు యువత ఉపాధి, ఉద్యోగాల నియామకం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుందని వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, కానిస్టేబుల్లు, హోంగార్డులు, పోలీస్ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.
 
                            