కౌటాల, సెప్టెంబర్ 26 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి అండర్-17 కబడ్డీ పోటీలు చీకట్లోనే నిర్వహించారు. ఫైనల్ పోటీలు జరిగే సరికి రాత్రి కావడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులోనే ముగించేశారు. కనీసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడగా, స్థానికులు నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు.
విజేతలు వీరే..
జిల్లా స్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో 27 బాయ్స్, 21 గర్ల్స్ టీమ్లు పాల్గొన్నాయి. బాయ్స్ ఫైనల్స్లో కాగజ్నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విజయం సాధించింది. మొగడ్ధగడ్ ఆశ్రమ పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. గర్ల్స్ ఫైనల్స్లో ఆసిఫాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ విజేతగా నిలిచింది. రెబ్బెన సోషల్ వెల్ఫేర్ రెండో స్థానంలో నిలిచింది. ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
తాము సెమీస్లో గెలిచినప్పటికీ నిర్వహణ కమిటీ సభ్యులు ఆడించలేదని కౌటాలకు చెందిన మ యూరీ విద్యాలయం విద్యార్థులు నిరసన తెలిపా రు. స్పందించిన కమిటీ సభ్యులు విద్యార్థులను, ఉపాధ్యాయులను సముదాయించి ముగ్గురు వి ద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడంతో ఆం దోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో గావుడే హన్మంతు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు నారాయణసింగ్, నానాజీ, పీడీలు సాంబశివరావు, మధుకర్, హరిక్రిష్ణ, జోసెఫ్ పాల్గొన్నారు.