ఎదులాపురం, సెప్టెంబర్ 15 : క్రమశిక్షణ, దేశభక్తి ఎన్సీసీతోనే సాధ్యమవుతుందని ఉమ్మడి ఎన్సీసీ జిల్లా కమాండింగ్ ఆఫీసర్ కల్నాల్ వికాస్శర్మ అన్నారు. తెలంగాణ 32 బెటాలియన్ సీఏటీసీఐ ఏడో శిక్షణ శిబిరం జిల్లా కేంద్రంలోని వైటీసీలో అట్టహాసంగా ప్రారంభమైంది. పది రోజులపాటు కొనసా గే శిక్షణకు కల్నాల్ వికాస్ శర్మ పాల్గొని కేడెట్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కల్నాల్ వికాస్ మాట్లాడుతూ.. దేశరక్షణ కో సం ఎన్సీసీ స్థాపించబడిందన్నారు.
బ్రిటిష్ కాలం నుంచే యూనివర్సిటీ కేడెట్ పేరున కొనసాగేదని, 1947లో ఎన్సీసీగా పేరును మార్చడం జరిగిందన్నారు. యుద్ధ పరిస్థితు లు వచ్చినప్పుడు ఎన్సీసీ కేడెట్లకు తొలి ప్రా ధాన్యత ఇచ్చి సైన్యంలో చేర్చుకుంటారన్నా రు. పది రోజులపాటు జరిగే శిక్షణలో కేడెట్లు మంచి ప్రతిభ కనబర్చాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఏలు జగ్జరాం, గాలి అశోక్, స్వామి, పూర్ణచందర్, రజిత, రాజేశ్వరి, శ్రీ నివాస్, సాయినాథ్, వినోద్, కేర్జేకర్లు ఉమేశ్ కుమార్ పాల్, నరేందర్ పాల్గొన్నారు.