కెరమెరి, డిసెంబర్ 30: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రజాపాలన ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ప్రశాంతి అన్నారు. కెరమెరి మండలంలోని మోడి గ్రామంలో ప్రజాపాలన సదస్సుకు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ ప్రజలు దరఖాస్తులో వివరాలు స్పష్టంగా రాసి ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణకు చాలా సమయం ఉన్నందునా, తొందరపాటు వద్దని ప్రజలకు సూచించారు.
ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, ఝరి, మోడి జీపీల సర్పంచులు కుమ్రం నాణేశ్వర్, మోహర్లే సుమన్‌బాయి వారిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీవో ఉమర్ హుస్సేన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం భట్, ఎంపీడీవో మహేందర్, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎఫ్ఆర్వో మజారొద్దీన్, ఏపీఎం జగదీశ్వర్, ఏపీవో మల్లయ్య, ఏఎస్ఐ బాల్సింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎండీ మునీర్ అహ్మద్, కార్యదర్శులు వాజీద్, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, డిసెంబర్ 30: మంచిర్యాల మున్సిపాలిటీలోని కాలేజీరోడ్‌లో ప్రజాపాలన దరఖాస్తుల కేంద్రాన్ని ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ప్రశాంతి తనిఖీ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ బీ రాహుల్, జడ్పీ సీఈవో నరేందర్‌తో కలిసి సందర్శించారు. నిర్ణీత గడువులోగా ప్రజలు తమ దరఖాస్తులు అందించాలని, పూర్తి వివరాలను అందులో పేర్కొనాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఏ మారుతీప్రసాద్, మున్సిపల్ ఇంజినీర్ మధూకర్, తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్, డిసెంబర్ 30: మండలంలోని ముల్కల్ల, వేంపల్లి గ్రామాల్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ప్రశాంతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్, డీఆర్డీవో అధికారి శేషాద్రి, డీపీవో వెంకటేశ్వర్ రావు, జడ్పీ సీఈవో నరేందర్, హాజీపూర్ తహసీల్దార్ సతీశ్ కుమార్, ఎంపీడీవో అబ్దుల్ హై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మండల ప్రత్యేకాధికారి రవీందర్ రెడ్డి, హాజీపూర్ డీటీ హరిత, ఎస్ఐ నరేశ్‌కుమార్, ఏపీవో మల్లయ్య, ఏపీఎం శ్రీనివాస్‌గౌడ్, మండల వ్యవసాయాధికారిణి మార్గం రజిత, విద్యుత్ శాఖ ఏఈ మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈ కామేశ్వర్ రెడ్డి, ఆర్ఐలు మంగ, ప్రభు, ఏఈవో కనకరాజు, తదితరులున్నారు.