ఎదులాపురం, ఏప్రిల్ 9 : గిరిజన హక్కుల సాధన కోసం పోరాడిన రాంజీగోండ్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రాంజీగోండ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని బస్స్టాండ్ ఎదుట గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు ఆదివాసీ సంఘాల నేతలు రాంజీగోండ్ విగ్రహానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన రాంజీగోండ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆ మహనీయడు చూపిన బాటలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిడాం రాంకిషన్, రోకండ్ల రమేశ్, కుమ్ర రాజు, మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ, రాజన్న, ఆశన్న, మమత, ఉదయ్కుమర్ పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట తెలంగాణ స్టూడెంట్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో రాంజీగోండ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.