సీసీఐ పునరుద్ధరణే లక్ష్యం
మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సం ఘాలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చా రు. సీసీఐ పునరుద్ధరణ, ప్రస్తుత పరిణామా లు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై సోమవారం ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవనంలో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఐక్య ఉద్యమానికి జోగు రామన్న పిలుపు
ఎదులాపురం, జూలై 20 : మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే వరకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సం ఘాలు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చా రు. సీసీఐ పునరుద్ధరణ, ప్రస్తుత పరిణామా లు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై సోమవారం ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవనంలో నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం లో మేధావులు, కళాకారులు, వివిధ సంఘా ల నాయకులు పాల్గొని సీసీఐ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తీ ర్మానించారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. 2015-16, 2016-17 సంవత్సరాల్లో అప్పటి కేంద్ర సహాయ మంత్రి హన్రాజ్ గంగారాం అహేరి, అప్పటి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువు రు నాయకులు ఎన్నికల సమయంలో సీసీఐ పునరుద్ధరణపై హామీలు ఇచ్చారని గుర్తు చేశా రు. అయితే కేంద్రంలో 13 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ అంశంపై ఇ ప్పటికీ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మం త్రి కేటీఆర్ సీసీఐ పునరుద్ధరణపై కేంద్రాన్ని ప్రశ్నించారని, టీఎస్-ఐపాస్ కింద కొత్త పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను సీసీఐ పునరుద్ధరణకు కూడా వర్తింపజేస్తామని లేఖ రూపం లో హామీ ఇచ్చారని తెలిపారు.
అవసరమైతే 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 49 శాతం కేంద్ర ప్రభుత్వం వాటాలతో పరిశ్రమను నడిపేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ట్లు కేంద్రానికి లేఖలు పంపిందని పేరొన్నా రు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, 2022లో సీసీఐ సాధన సమితి ఏర్పడి పరిశ్రమ పునఃప్రారంభం కోసం నిరంతరం ఉద్యమిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో చొరవ తీసుకుని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, అవసరమైతే తాము ప్రభుత్వంతో కలిసి కేంద్ర మంత్రులను కలిసి సీసీఐ పునరుద్ధరణ కోసం ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన సమితి కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో-కన్వీనర్ నారాయణ, బండి దత్తాత్రి, నగేష్, సంగెపు బొర్రన్న, మంజుల, స్వప్న, కిరణ్, సచిన్, వెంకటనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

