బోథ్, డిసెంబర్ 12 ః మండలంలోని వివి ధ గ్రామాలకు చెందిన యువకులకు ఉద్యోగా లు ఇప్పిస్తామని చెప్పి టోకరా చేసిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకా రం.. కరీంనగర్‌కు చెందిన సతీశ్, రేష్మాలు సంపత్‌నాయక్ తండాకు చెందిన రాథోడ్ వినోద్ ద్వారా రాథోడ్ సంజీవ్‌కు ఫోన్లో పరిచయం అయ్యారు.
సంపత్ నాయక్ తండాకు చెందిన రాథోడ్ సంజీవ్ వద్ద యేడాది క్రితం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.50 లక్షలు తీసుకుని ఎలక్షన్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించారు. రాథోడ్ బాపురావ్ వద్ద కూడా రూ.1.20 లక్షలు తీసుకుని కార్లో కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు.
ఘన్పూర్ గ్రామానికి చెందిన చౌహన్ మశ్చందర్, టీవీటీ పల్లెకు చెందిన ఆత్రం బాలు, ఆత్రం జంగు, సంపత్ నాయక్ తండాకు చెందిన రాథోడ్ గణేశ్‌ల వద్ద నుంచి కూడా రూ.70 వేల చొప్పున రూ.2.80 లక్షలు వసూలు చేశారు. అందరి వద్ద నుంచి దాదాపు రూ.5.50 లక్షలు వసూలు చేసి ఎవరికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశారు. తమను ఉద్యోగాల పేరిట మోసం చేసిన సతీశ్, రేష్మాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ వివరించారు.