కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కెరమెరి, జనవరి 12 : సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో కొలువైన జంగుబాయికి భక్తు లు నీరాజనం పలుకుతున్నారు. ఈ నెల 2న ప్రారంభమైన జాతరకు ఆదివాసులు పోటెత్తుతున్నారు.
ఆదివారం తెలంగాణ, మహారాష్ర్టా ల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ, రావుడ్క్పేన్, మైసమ్మ వద్ద మేకలు, కోళ్లను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రంతా అక్కడే బసచేశారు. ఇక సోమవారం అమ్మవారి వద్ద మహాపూజ, దర్బార్ నిర్వహించనుండగా ఏర్పాట్లు చేశారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, వెడ్మా బొజ్జు హాజరుకానున్నారు.