జంగుబాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు.
- ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కలక లక్కేరావ్
- పోస్టర్ విడుదల
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 28 : ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. బుధవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో జంగుబాయి ఉత్సవాల ప్రచార పోస్టర్, ఆహ్వాన పత్రికలను కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో కొలువైన జంగుబాయి దేవస్థానం పవిత్ర పుష్యమాసం ఈ నెల 26 నుంచి జనవరి 20వ తేదీ వరకు కోట పరందోలి బీడ్వార్ గోండులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ర్టాల ప్రజలు పెద్దసంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నదని అన్నారు. భక్తులకు అవసరమై మౌళిక సదుపాయాలు ప్రాజెక్టు అధికారి ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ఏపీవో జనరల్ కనక భీంరావ్, అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి కరీం, పెసా కోఆర్డినేటర్ వసంత్, జిల్లా సార్మేడి దుర్గు పటేల్, జంగుబాయి దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కొడప జాకు, గౌరవాధ్యక్షుడు బాజీరావ్, ఉపాధ్యక్షుడు రాయిసిడాం జంగు, జాకీరావ్, సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

