ఇచ్చోడ, నవంబర్ 5 : తెలంగాణ సమగ్ర అభివృద్ధి, సబ్బండ వర్గాల సంక్షేమానికి కేసీఆర్ భరోసాగా ఉన్నారని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. ఆదివారం మండలంలోని ముక్రా(బీ) గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌కు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ నిరంతరం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ముండే పాండు, మాజీ మండలాధ్యక్షుడు మెరాజ్ అహ్మద్, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, సర్పంచ్ మారుతి, పవార్ జనార్దన్, సలీం, నజీర్, ఖారే సంజీవ్, ఖారే శంకర్, ప్రహ్లాద్, దిలీప్, మహేందర్, నావాజ్, పీఏసీఎస్ డైరెక్టర్ బద్దం పురుషోత్తం రెడ్డి, ఉపసర్పంచ్ శివాజీ, బీఆర్ఎస్ నాయకులు సాబీర్, మాతిన్, సుభాష్ పాటిల్, మాజీ జడ్పీటీసీ కృష్ణకుమార్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ దయాకర్ రెడ్డి, పాండురంగ్, శివ, రవి, గంగాధర్, గణేశ్, మహేశ్, నంద కిశోర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇచ్చోడ, నవంబర్ 5 : మండలంలోని ఎల్లమ్మగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి అజీస్, ఎస్కే హసాన్, జై హుద్దీన్, మోహిజ్, జావిత, రఫీ, కలీం, బసీర్, మతిన్, నజీర్, ఇస్మాయిల్‌తో పాటు 80 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవన్న, రాజు, సురేందర్ గౌడ్, ఎం మల్లేశ్, ఫేరోజ్ పాల్గొన్నారు.