మంచిర్యాలటౌన్, అక్టోబర్ 22 : మంచిర్యాల ప ట్టణంలోని ఐబీ చౌరస్తాలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ‘మంచి మంచిర్యాల’ అక్షరాల తొలగింపు అం శం గందరగోళానికి దారి తీసింది. ఆదివారం సా యంత్రం వరకు కనిపించిన సెల్ఫీపాయింట్ సోమవారం ఉదయానికి కనపడకపోవడం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఎక్కడ చూసినా ‘అసలు ఏం జరిగింది.. ఎవరు తీశారు.. ఎందుకు తీసివేయాల్సి వచ్చింది’ అని మాట్లాడుకోవడమే కనిపించింది. మ రోవైపు స్టీలుతో తయారు చేయించిన ‘మంచి మంచిర్యాల’ అక్షరాలను దొంగలు ఎత్తుకెళ్లారన్న ప్రచారం కూడా సాగింది. మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులను అడిగితే తమకేమీ తెలియదని చెప్పి దాటవేశారు.
ఇక ఈ విషయం బయటకి రావడంతో మంగళవారం మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు సెల్ఫీపాయింట్ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ పూర్తి బాధ్యత వహించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి సీన్ వేరే మారింది. కాంగ్రెస్ నాయకుల ప్రెస్మీట్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య మంచి మంచిర్యాల అక్షరాలను తామే తీసివేయించామని ప్రకటించారు. పక్కన భవనాన్ని కూల్చుతున్నందున అక్షరాలు దెబ్బతిన కూడదన్న ఉద్దేశంతోనే వాటిని తొలగించామని చెప్పారు.
ఆ అక్షరాలను వాటర్ ట్యాంకు దగ్గర గదిలో భద్రపరిచామని తెలిపారు. అయితే మున్సిపల్ కమిషనర్‌కు, అధికారులకు ఈ విషయం తెలియదని, సమాచార లోపం వల్లనే కమిషనర్ తనకు తెలియదని చెప్పాడని తెలిపారు. భవనం కూల్చుడు అయిపోయాక సెల్ఫీపాయింట్ అక్షరాలను తొలగించడమేమిటని చైర్మన్‌ను అడుగగా, ఆయన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో పట్టణ సుందరీకరణలో భాగంగా ఐబీ చౌరస్తాను అభివృద్ధి చేసే క్రమంలో రూ. 10 లక్షలు వెచ్చించి సెల్ఫీపాయింట్‌ను ఏర్పాటు చేశారు. ‘మంచి మంచిర్యాల’ అనే అక్షరాలతో పాటు చుట్టూ స్టీల్ రెయిలింగ్, మార్బుల్, గ్రీనరీని అభివృద్ధి చేశారు. మంచిర్యాలతో పాటు ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వారు ఇక్కడ సెల్ఫీలు దిగి తమ స్టేటస్‌లలో పెట్టుకునే వారు.