నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ( Adilabad ) గాదిగూడ మండలానికి చెందిన పెందోర్ దీపిక ( Deepika ) జాతీయస్థాయి పుస్తక రచయితగా ఎదగడం హర్షనీయమని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ అన్నారు. జాతీయస్థాయి పుస్తక రచయిత శిక్షణలో పాల్గొని గురువారం గ్రామానికి వచ్చిన దీపికకు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపిక జాతీయస్థాయి పుస్తక రచనలు ఎంపిక కావడం ఆదివాసి సమాజానికి గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఆదివాసి యువతి యువకులు దీపికను ఆదర్శంగా తీసుకొని చదువులలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సోనేరావు, శంకర్, యువకులు రవీందర్, నాగేందర్, జగన్నాథ్, గ్రామ పెద్దలు ఉన్నారు.