ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గురుకుల విద్యార్థులకు( Gurukul Students ) విద్య ద్వారా భవిష్యత్ వెలుగులు తీసుకురావాలంటే ప్రభుత్వ స్పందన అత్యవసరమని ఏజెన్సీ సాధన కమిటీ సభ్యులు జాదవ్ సుమేష్. దీపక్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన, పేద విద్యార్థుల భవిష్యత్ కోసం సీట్లను పెంచాలని ( Increase seats ) కోరారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు.
గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రస్తుతం ఉన్న సీట్లు చాలక పోవడంతో అనేక మంది పేద విద్యార్థులు అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో విద్యార్థులు అర్హత సాధిస్తున్నా సీట్ల కొరత కారణంగా ప్రైవేట్ విద్యాసంస్థలకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.