కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipet ) మండలం దేవాపూర్ పాఠశాలలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిజ్ఞాస మొబైల్ సైన్స్ ఇన్చార్జి లక్ష్మణ్ నేతృత్వంలో సైన్స్ ( Science ) ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 6 నుంచి 10 వ తరగతి చదివే విద్యార్థులందరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జీవశాస్త్ర , వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు విద్యార్థుతోనే చేయించారు.
ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు రాథోడ్ రమేష్ మాట్లాడుతూ నేటి నవీన సమాజంలో విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకుని అనేక కొత్త ఆవిష్కరణలు చేసి సైంటిస్ట్‌గా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్ బాబు, లచ్చన్న, రాజేష్, పద్మ కుమారి, రమణయ్య, సులోచన, నిర్మల, మహేష్, కృష్ణ, రజిత విద్యార్థులు పాల్గొన్నారు.