వైభవంగా దుర్గామాతకు బోనాలు
ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం దుర్గామాతకు బోనాలు సమర్పించారు. మండ లంలోని రాజురా గ్రామంలో దుర్గామాతకు మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఖానాపూర్ రూరల్, అక్టోబర్19ః ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం దుర్గామాతకు బోనాలు సమర్పించారు. మండ లంలోని రాజురా గ్రామంలో దుర్గామాతకు మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. (కే) బావపూర్లోని దుర్గామాత ఆలయంలో గ్రామస్తులు బోనాలను సమర్పించారు. ఎంపీటీసీ రాజు, సర్పంచ్ చిన్నం లావణ్య, చిన్నం రవి, పులివేని సత్యనారాయణ, లింగన్న, చిలివేరి మల్లేశ్, బొంత భూమన్న, పెద్ది రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దస్తురాబాద్‌లో..

దస్తురాబాద్, అక్టోబర్ 19 : మున్యాల, కొత్తగూడెం కాలనీ, రేవోజిపేటలో దుర్గామాత నవరాత్రోత్సవాలు సాగుతున్నాయి.గురువారం మున్యాల గ్రామంలో సిద్ది వినాయక యూత్ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వ హించారు..ఈ సందర్భంగా జడ్పీటీసీ సంతపూరి శారద మహిళలతో కలిసి బోనాన్ని ఎత్తుకోని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
ఖానాపూర్‌లో..
ఖానాపూర్, అక్టోబర్ 19 : దేవీ శరన్నవరాత్రో త్సవాల సందర్భంగా ఖానాపూర్‌లో శ్రీవారి పల్లకీ సేవ నిర్వహించారు. గురువారం రాత్రి అంబే ద్కర్‌నగర్ కాలనీలో ఈ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు విగ్రహమూర్తులకు మంగళ హారతులతో స్వాగ తం పలికారు. పలికారు. ఈ పల్లకీ సేవ ప్రతి రోజూ ఒక్కో వార్డులో ఊరేగిస్తున్నారు. వేంకటే శ్వర స్వామి ఆలయ స్థానాచార్యులు నరసింహ మూర్తి, సహాయకుడు నిమ్మగడ్డ నాగరాజు శర్మ, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అడ్డగట్ల రాజన్న, నిమ్మల రమేశ్ భక్తులు శంకర్, గంగా ధర్, ప్రణీత్, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

