గడప గడపకూ బీఆర్ఎస్
ఆదిలాబాద్, నిర్మల్‌జిల్లాలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
- కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థన
- ఇంటింటికీ వెళ్తున్న నాయకులు, కార్యకర్తలు
- గ్రామాల్లో బ్రహ్మరథం పడుతున్న జనం
- పెరుగుతున్న చేరికలు, మద్దతు
ఆదిలాబాద్, నిర్మల్‌జిల్లాలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ అభ్యర్థి ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్ మండలం కంట, మాకోడ, పిప్పల్‌గావ్, తరోడ, పూసాయి, డొల్లార, హంసీపూర్, మాండగడ, కమాయి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ప్రచారంతో పాటు పొలాల్లో రైతుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.

బోథ్ మండలం కైర్తట్వా, పట్నాపూర్, కంటెగాం, నక్కలవాడ, నిగినిలో బోథ్ అభ్యర్థి అనిల్‌జాదవ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ తనను ఆశీర్వదించాలని కోరారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో నిర్మల్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తానూర్ మండలంలోని గ్రామాల్లో ముథోల్ అభ్యర్థి విఠల్ రెడ్డి ప్రచారం చేశారు. ఖానాపూర్‌లో అభ్యర్థి జాన్సన్ నాయక్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
-ఆదిలాబాద్, నవంబర్ 18 ( నమస్తే తెలంగాణ)

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

