జైనూర్, ఏప్రిల్ 10 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవ్రావ్, పీఏసీఎస్ చైర్మన్ కొడప హన్నూ పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్‌లాలా, ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ ఆడ బీర్షావ్, జీపీ ఈవో ఆనంద్‌రావ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.
హనుమాన్ జయంతి పోస్టర్ ఆవిషరణ
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 10 : ఆసిఫాబాద్‌లోని కెస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ నెల 12న నిర్వహించనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే కోవలక్ష్మి గురువారం తన నివాసంలో ఆలయ కమిటీతో కలిసి ఆవిషరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
అనంతరం ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు నివాసంలోనూ పోస్టర్‌ను ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండ వెంకన్న, ఆలయ కమిటీ ప్రముఖులు పిన్న వివేక్, ఏకీరాల శ్రీనివాస్, చిలుకూరి రాధాకృష్ణ చారి, డాక్టర్ మధు, మురళీగౌడ్, లక్ష్మణమూర్తి పాల్గొన్నారు.