విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి
ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీసీ వెంకటరమణకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై మంత్రితో వీసీ చర్చించారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా విద్యార్థులకు
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై మంత్రితో ట్రిపుల్ఐటీ వీసీ చర్చ
- పోస్టుల భర్తీ, విద్యార్థుల సంఖ్య, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా..
బాసర, సెప్టెంబర్ 13 : ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీసీ వెంకటరమణకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై మంత్రితో వీసీ చర్చించారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.., ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగుల సంఖ్యను మంత్రులు వీసీ నుంచి తెలుసుకున్నారు. ఈ ఏడాది నూతనంగా చేరే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జీయూకేటీకి ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రులు హామీచ్చారు. వచ్చే వారంలో నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్తగా చేరే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆర్జీయూకేటీలో తీసుకుంటున్న చర్యలపై అధికారులను మంత్రులు అభినందించారు.
మంత్రి ఐకేరెడ్డికి ఆహ్వానం..
బాసర ట్రిపుల్‌ఐటీని సందర్శించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని వీసీ వెంకటరమణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయనను కలిసి విన్నవించారు. క్యాంపస్‌లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి.. త్వరలోనే సందర్శించి, తన వంతుగా సాయం చేస్తానని హామీ ఇచ్చారని వీసీ తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

