నార్నూర్ : గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించకుంటే పాలకవర్గం పదవులకు రాజీనామా ( Resign ) చేస్తామని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం బేతాల్ గూడ పంచాయతీ సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం జరిగిన గ్రామసభలో సభ్యులు పాల్గొని మాట్లాడారు.
కనీసం గ్రామపంచాయతీలో మౌళిక వసతులు లేకపోవడం వల్ల గ్రామసభను బహిష్కరిస్తున్నామని తెలిపారు. వసతులు కల్పించకుంటే పదవులకే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెందూర్ హరికృష్ణ, బొజ్జు పటేల్, రవీందర్, బలి రామ్, సుగుణ, సుస్మిత, చంద్ర కాంత్, లక్ష్మి బాయి, తదితరులు పాల్గొన్నారు.