కౌటాల : అంతర్జాతీయ మహిళా దినోత్సవ (Womens Day ) సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సిద్ధార్థ హెచ్పీ గ్యాస్ (HP Gas ) డీలర్ దుర్గం జానకిరామ్ శనివారం ప్లేటు, గ్లాసులు పంపిణీ చేశారు. పాఠశాలలోని 90 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్టీల్ గ్లాసు ( Steel Glass ) , స్టీల్ ప్లేటు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈవో గావిడే హనుమంతు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సహించడానికి హెచ్పీ గ్యాస్ డీలర్ చేసిన సహాయం ప్రశంసనీయమని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యనుభ్యసించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఎంతో విద్యను అభ్యసించి కాంపిటీషన్లో గెలుపొంది ఉపాధ్యాయులుగా వచ్చారని తెలిపారు.
ప్రైవేట్ తో పోల్చుకుంటే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని, ప్రతి విద్యార్థి చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం గణపతి, సీఆర్పీ దేవన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.