గుడిహత్నూర్, జూన్ 26: గుడిహత్నూర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రెండు రోజుల క్రితమే తొలకరి పలకరించడంతో రైతులంతా విత్తనాలు వేశారు. సోమవారం గంట పాటు పడిన వర్షంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు. గుడిహత్నూర్‌లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. లింగాపూర్ వెళ్లే దారిలో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది.
భీంపూర్, జూన్26: మండలంలోని భీంపూర్ మండల పెన్‌గంగ పరీవాహక ప్రాంతాలు సహా అన్ని శివార్లలో సోమవారం మధ్యాహ్నం చిరుజల్లులు పడ్డాయి. దీంతో రైతులు ఆనందంలో మునిగితేలారు.
నార్నూర్,జూన్ 26: ఉమ్మడి మండలంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. రెండో రోజు కూడా వర్షం పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీవర్షంతో వాగులువంకల్లో నీరు చేరింది. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.
తాంసి, జూన్ 26: మండలంలోని గిరిగామ తాంసి, వడ్డా డి, పొన్నారి, జామిడి, బండల్ నాగపూర్, కప్పర్ల, ఈదు ల్లా సవర్గాం, హస్నాపూర్, పాలోడి, గోట్కూరి, అంబు గాం గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మో స్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వానకాలం సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటినా ఇప్పటికీ సరైన వర్షాల్లేక పలు మండలాల్లో రైతులు అయోమయం లో ఉన్నారు. మూడు రోజులుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో పత్తి విత్తనాలు విత్తుతూ, పొలం పనుల్లో బిజీగా మారారు.
ఉట్నూర్, జూన్ 26: మండలంలో సోమవారం కురిసిన వర్షంతో రైతన్నలకు ఊరట లభించింది. ఇప్పటికే పలువు రు రైతులు విత్తనాలు విత్తుకున్నారు. వర్షాల కోసం ఆందోళన చెందుతున్న సమయంలో రెండు రోజులుగా చి రుజల్లులతో వాతావరణం మురిపించింది. సోమవారం కొద్దిపాటి వర్షం కురిసింది. దీంతో భూములు తడిసి, అన్నదాత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ టౌన్, జూన్ 26ః: నిర్మల్ జిల్లాలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మృగశిర కార్తె ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా, చినుకు జాడ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. గత మూడు రోజులుగా జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, వర్షాలు కురవడంతో రైతులు పంట చేలల్లో విత్తనాలు విత్తుకునే పనిలో బిజీగా ఉన్నారు. సోమవారం జిల్లాలో 15.7మి.మీ వర్షపాతం నమోదైంది. తానూరులో 48.6మి.మీ, బాసరలో 5.6, ముథోల్‌లో 53.0, భైంసాలో 40.6, కుంటాలలో 31.4 ,నర్సాపూర్ (జీ) 5.8, లోకేశ్వరంలో 20.2, దిలావర్పూర్లో 5.8, సారంగాపూర్‌లో 4.8, నిర్మల్‌లో 9.2, నిర్మల్ రూరల్ 15.4, సోన్‌లో 1,లక్ష్మణచాందలో 6.4, మామడలో 16.2, పెంబిలో 8.2, ఖానాపూర్‌లో 16.8, కడెం పెద్దూర్లో 3.6, దస్తురాబాద్‌లో 5.8 మి.మీటర్ల వర్షపా తం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు