ఎదులాపురం : పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బిపిన్ కుమార్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా న్యాయవాద గుమస్తాలకు ఆరోగ్య బీమా ( Health insurance) చేసి ఉదారతను చాటారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలోని గుమస్తాల కార్యాలయంలో వారితో కలిసి కేక్ కట్ చేసి జన్మదినాన్ని వేడుకగా జరుపుకున్నారు.
అనంతరం ఆయన గుమస్తాలకు ఆరోగ్య బీమా బాండ్లను అందజేశారు. పలువురు న్యాయవాదులు, గుమస్తాలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన సమద్‌ను సత్కరించారు. తమను గుర్తించి ఆరోగ్య బీమా బాండ్లను అందించడం పట్ల న్యాయవాదుల గుమస్తాలు బిపిన్ కుమార్ పటేల్‌కు ధన్యవాదలు తెలిపారు.