తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి( Tamsi) మండలంలోని రాంనగర్లో ఉన్న శ్రీ రాముల గుట్టను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ (MLA Anil Jadav ) దర్శించుకున్నారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయానికి కాలినడకన వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాములగుట్టను దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్న కొనేరును పరిశీలించారు. దేవుడి ఆశీస్సులతో ఆలయంలో వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.