కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో ముస్లిములు గ్యార్మీ షరీఫ్(Gyarmi Sharif ) ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ( Durgam Chinnaiah) పాల్గొన్నారు. సూఫీ ఆధ్యాత్మిక గురువు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీని స్మరించే పవిత్ర ఉత్సవం గ్యార్వీ షరీఫ్ పండుగని అన్నారు.
ఖాదిర్ బోధనలను ముస్లీములు పాటించాలని కోరారు. పాపప్రక్షాళన గ్యార్వీ షరీఫ్ ఉద్దేశమని, ఆర్థిక లాభాలు, వ్యక్తిగత స్వార్థాలతో ఆందోళన చెందుతున్న ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతనను పండుగ ప్రబోధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గొంది వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మడావి అనంతరావు, పెంద్రం హన్మంతు, మాజీ సర్పంచ్ అజ్మీర తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, జాడి రాంచందర్, సుధాకర్ రెడ్డి, కైలాస్, ఖదీర్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.