అధ్యాపకురాలు తిట్టిందని రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు
ఉట్నూర్ డివిజన్ కేం ద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు తమని బూతులు తిట్టిందని వి ద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం కుమ్రం భీం ప్రాంగణంలోని డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు ప్రత్యూష తమను బూతులు తిట్టిందని విద్యార్థులు కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించారు.
ఉట్నూర్, మార్చి 6: ఉట్నూర్ డివిజన్ కేం ద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు తమని బూతులు తిట్టిందని వి ద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం కుమ్రం భీం ప్రాంగణంలోని డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు ప్రత్యూష తమను బూతులు తిట్టిందని విద్యార్థులు కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. కొన్ని రోజులుగా అధ్యాపకురాలు తిడుతున్నా ప్రిన్సిపాల్ సైతం పట్టించుకోవడం లేదని అందుకే ఆందోళనకు దిగినట్లు విద్యార్థినులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న గురుకుల ప్రాంతీయ కార్యదర్శి ఆగస్టియన్, ఎస్ఐ విజయ్, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్ వచ్చి విద్యార్థులను సముదాయించినా వినలేదు. అధ్యాపకురాలిని కళాశాల నుంచి పంపించే వరకు విరమించేది లేదని హెచ్చరించారు. ఐటీడీఏ పీ వో యువరాజ్‌కు ఫిర్యాదుచేసి బదిలీపై పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. అయితే కొందరు విద్యార్థినుల వద్ద ఉన్న ఫోన్లను తీసుకొని అధ్యాపకురాలు పరిశీలించి, తిట్టినట్లు తెలిసింది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

