నెన్నెల, డిసెంబర్ 28 : నెన్నెల మం డల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్, జూనియర్ కాంగ్రెస్ నాయకులు, కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు హాజరయాయ్యారు. ఇదే కార్యక్రమానికి నెన్నెలకు చెందిన తోట శ్రీనివాస్, పలువురు సీనియర్ పార్టీ నాయకులు చేరుకున్నారు. మండల నాయకులు హరీశ్‌గౌడ్ గ్రూపున కు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నా రు. జండా ఎగురవేయడానికి మండల అధ్యక్షులు గట్టు మల్లేశ్ నాయకులందరినీ ముందుకు ఆహ్వానించారు. అక్కడే ఉన్న ఓ వర్గం కార్యకర్తలు తోట శ్రీనివాస్ ఇక్కడికెందుకు వచ్చాడు.. రావద్దంటూ నినాదాలు చేశారు.
పార్టీ అభ్యర్థిని ఓడించిన వారు ఇక్కడికి రావద్దని కొందరు.. మీరెవరు రావద్దని చెప్పడానికి.. పార్టీ అధిష్ఠానం పిలిస్తే వచ్చామని, జెండా ఎవరిది కాదని, అందరిదని శ్రీనివాస్ వర్గం వారు వాదించారు. ఈ నేపథ్యంలో ఒకరినొకరు దూషించుకుంటూ.. తోపులాటకు దిగారు. జెండా ఎగురనీయమని కొందరు.. జెం డా మాదని కొందరు అడ్డుపడ్డారు. జెండా ఎగురవేయాడనికి అధ్యక్షుడు సిద్ధం కాగా, ఆయన చేతిలో నుంచి కూడా తాడును లాక్కున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల కంటే ముం దు నుంచే సీనియర్లు, జూనియర్లు అం టూ గ్రూపులు కట్టారు. మొన్న మండలం లో ఎవరి ఇష్టానుసారంగా వారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇప్పటికే నె న్నెల కాంగ్రెస్ అంటేనే ఎమ్మెల్యే వినోద్‌కు వస్తుందట. ఎన్నోసార్లు నెన్నెల నాయకుల తీరుపట్ల తల పట్టుకున్నాడని పార్టీ సీనియర్ నాయకులు చెప్పారు.