సోన్, జనవరి 14 : సోన్, నిర్మల్ మండలా ల్లోని ఆయా గ్రామాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు వివిధ రకాల పిండి వంటలు తయారు చేశారు. శని వారం ఉదయమే మహిళలు, చిన్నారులు తమ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేసి భోగి మంటలు నిర్వహించారు. నిర్మల్ మండలం వెంగ్వాపేట్, అక్కాపూర్, చిట్యాల్, డ్యాంగాపూర్, సోన్, న్యూవెల్మల్, బొప్పారం, పాక్పట్ల, మాదా పూర్, తదితర గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడ్తాల్ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆల యం అయ్యప్ప నామస్మరణ సంకీర్తనలు, శరణు ఘోషతో మారుమోగింది. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో పురవీధులగుండా ఊరేగించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల కు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ గురు స్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
లక్ష్మణచాంద, జనవరి 14 : సంక్రాంతి పండుగను మండలంలోని అన్ని గ్రామాల్లో సంబురంగా జరుపుకున్నారు. శనివారం భోగి సందర్భంగా ప్రతి ఇంటి వద్ద రంగులరంగుల ముగ్గులతో సంక్రాంతికి స్వాగతం పలికారు. ఉద యం సమయంలో భోగి మంటలు వేసు కున్నారు. ప్రతీ ఇంటిలో పిండివంటలు చేసి సంబురంగా పండుగ జరుపుకున్నారు.
దస్తురాబాద్, జనవరి 14 : మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామాల్లో శనివారం బోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకువ జామున నుంచే మహిళలు,యువతులు ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు. పలు గ్రామాల్లో భోగి మంటల వేడుకల్లో మహి ళలు, యువతులు పాల్గొన్నారు. భోగి పండ్లను తమ తమ పిల్లల తలపై పోసి ఆశ్వీరదించారు. రకరకాల పిండి వంటలను చేసుకున్నారు.
దస్తురాబాద్, జనవరి 14 : నెల రోజుల పాటు సాగిన ధనుర్మాసోత్సవాలు ముగి శాయి. మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహా స్వామి ఆలయాలు, రేవోజిపేటలోని సీతా రామా లయంలో అర్చకులు కొండమాచార్యులు, వొద్ది పర్తి వంశీ కృష్ణ చార్యుల ఆధ్వర్యంలో నెల రోజు లతో పాటు ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరిగా యి. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
భైంసా, జనవరి 14 : భైంసాలోని భట్టిగల్లీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. భట్టిగల్లీ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు మల్లేశ్, మాజీ అధ్యక్షుడు పోశెట్టి, మిత్ర మండలి అధ్యక్షుడు కాశీనాథ్, మున్నూరు కాపు సంఘం సభ్యులు పోశెట్టి, ముత్యం, తదితరులు ఉన్నారు.