సిసిసి నస్పూర్ : నస్పూర్ పట్టణంలో శ్రీ వైష్ణవ ఆయిత చండీహోమం(Chandi Homam) ఘనంగా కొనసాగుతుంది. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో చండీ హోమాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం యాగశాలలో విశేష చండీ హోమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి లక్ష గాజుల అర్చన, లక్ష పుష్పార్చన( Puspaarchana) , కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.