రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు (Grain Purchase) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ ( David ) ఆదేశించారు. జిల్లాలోని రెబ్బెన మండలం ఎడవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించి పలు సూచనలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. తేమశాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని తూకం వేసిరైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షాలు సమీపిస్తున్నందున ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం కొండపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరై దరఖాస్తు ప్రక్రియ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాష్ రావు, సిబ్బంది ఉన్నారు.