బెల్లంపల్లి, ఫిబ్రవరి 10 : ఇటీవ ల జరిగిన జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 సైక్లింగ్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ బాలుర జూనియ ర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి వర్షిత్ ప్రతిభ చూపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన జాతీయ స్థాయి సైక్లింగ్ టీమీ స్ప్రింట్ విభాగంలో వర్షిత్, సింహాచలం, అభిషేక్‌రెడ్డిలతో కూ డిన తెలంగాణ బృందం కాంస్య పతకం కైవసం చేసుకుంది.
ప్రథమ స్థానంలో రాజస్థాన్, ద్వితీ య స్థానంలో మహారాష్ట్ర, తృతీయ స్థానాన్ని తెలంగాణ దక్కించుకున్నాయి. వర్షిత్‌ను డీఐఈవో శైలజ, కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, పీడీ బొంకూరి బాబురావు, లెక్చరర్లు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.