తాండూర్ : మండలంలోని ఆయా గ్రామాలలో శుక్రవారం పనుల జాతర ( Panula Jatara ) కార్యక్రమాలను అధికారులు, నాయకులు నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి( Village Development) , ఉపాధి హామీ పథకం ( EGS ) ద్వారా పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఉపాధి హామీ నిధులతో మంజూరైనా పశువుల పాకలు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు ( GP Buildings ) నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో అనిల్ కుమార్, నాయకులు సూరం రవీందర్ రెడ్డి, ఎండీ ఈసా, మహేందర్ రావు, సిరంగి శంకర్, దామోదర్ రెడ్డి, మామిడాల రాజేశం, మోమిన్ అలీ, పుట్ట శ్రీను, సంగరావు శ్రీధర్, పీఆర్ ఏఈ సాయిలత, ఈజీఎస్ ఏపీవో నందకుమార్, ఏకేపీ ఏపీఎం శ్యామల, ఆయా గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.