Government Benefits | ప్రభుత్వ ప్రయోజనాలు అందరికీ అందాలి : అదనపు కలెక్టర్ చంద్రయ్య
Government Benefits | పీఎం అజయ్ ప్రాజెక్టు ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య అధికారులకు సూచించారు.
తాండూర్ : పీఎం అజయ్ ప్రాజెక్టు ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య ( Chandraiah ) అధికారులకు సూచించారు. పీఎం అజయ్( PM Ajay ) కి ఎంపికైన మండలంలోని చౌటపల్లి గ్రామపంచాయతీని మంగళవారం బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి కె సతీష్ కుమార్ తో కలిసి సందర్శించారు.
గ్రామంలో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకుని పనులు సక్రమంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనుల ప్రయోజనాలను ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైన్స్ పరిశీలించారు.
వేసవిలో నీటి సరఫరాలో ఎలంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. నర్సరీ, వైకుంఠ ధామం, సిగ్రిగేషన్ షెడ్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఇక్కడ ఎంపీడీవో పీ శ్రీనివాస్; ఎంపీవో అనిల్ కుమార్, సర్పంచ్ ముదాం సునీత, కార్యదర్శి వసంత, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

