కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ఎమ్మార్పీఎస్ ( MRPS ) మండల కన్వీనర్‌గా గొడిశెల క్రాంతి( Kranthi) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇన్చార్జి జిలకర శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సీనియర్ నాయకులు దాసరి శంకర్ అధ్యక్షత వహించగా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కో కన్వీనర్‌గా కాంపెల్లి వెంకటేశ్‌ను ఎన్నుకుని నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కన్వీనర్, కో కన్వీనర్లను శాలువాలతో సన్మానించారు.
ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కృషి చేస్తానని నూతన కన్వీనర్ గొడిశెల క్రాంతి తెలిపారు. మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా వర్గీకరణను సాధించుకున్నామన్నారు. జాతి అభివృద్ధి కోసం, హక్కుల కోసం ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. అనంతరం ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చొప్పదండి కిషన్‌ను ఎమ్మార్పీఎస్ నాయకులు శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లంక లక్ష్మణ్, దాసరి రాజయ్య, గొడిశెల బాపు, దాసరి శంకర్, గొడిశెల బాలయ్య, గొడిశెల బుగ్గ రాజు, సురేందర్, ఆజయ్. కుమార్, చొప్పదండి కిషన్, గసిగంటి మల్లేశ్, కళ్యాణ్, దాసరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.