రెబ్బెన : కుమ్రం భీం జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు మహాంకాళీ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ( Navaratri celebrations ) ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఉత్సవాల 8వ రోజు అమ్మవారు, శ్రీ మహా సరస్వతి దేవి ( Maha Saraswati Devi ) గా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలించ్చారు. మూల నక్షత్రం కావడంతో దేవస్థానంలో దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. అనంతరం ఆలయ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు.