నార్నూర్ : గాదిగూడ మండలంలోని అర్జునీ ఆశ్రమ బాలికల పాఠశాలను, కొలంగూడ శాటిలైట్ సెంటర్ను జీసీడీవో మెస్రం ఛాయ (GCDO Mesram Chaya) శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమై ఆరోగ్య పరిస్థితులను ( Students Health) అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .
పాఠశాల పరిసరాలు, వంటగది శుభ్రంగా ఉంచాలని, వంట సామాగ్రి , కూరగాయలు శుభ్రంగా కడిగి వంటచేయాలని సూచించారు, అనంతరం విద్యార్థుల ఆరోగ్య రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు పరిశీలిస్తూ ఉండాలని ఏఎన్ఎంకు ఆదేశించారు. సిక్రూం ను , మందులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన ఎలక్షన్ నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆమె వెంట పవార్ శ్యామ్ ,కోవా అశోక్ ఉన్నారు.