నార్నూర్, నవంబర్ 14 : క్రాంతి గురు లాహుజీ సాల్వే ఆశయ సాధనకు కృషి చేయాలని సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో లాహుజీ సాల్వే 237వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాహుజీ సాల్వే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రాంతి గురు లాహుజీ సాల్వే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. నేటితరం యువత మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం నార్నూర్ చైర్మన్ ఆడే సురేష్, డైరెక్టర్ దుర్గే కాంతారావు, దళిత అవార్డు గ్రహీత కోరల మహేందర్, నాయకులు గైక్వాడ్ దిగంబర్, రాము, గణేష్, ఆడే వసంత్ రావు, చౌహాన్ యశ్వంత్ రావు, ప్రకాష్ తదితరులున్నారు.