BEJJURU | బెజ్జురు, మార్చి 30 : మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన పోచమ్మ ఆలయం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి ఉగాది పచ్చడిని స్వీకరించారు. కొత్త సంవత్సరం ప్రజలకు మేలు జరగాలని పోచమ్మతల్లిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం బెజ్జూర్ రంగనాయక ఆలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేకు మన్నేవారి సేవా సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. అసెంబ్లీలో మన్నేవారి సేవా సంఘం ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించినందుకు వారు ఎమ్మెల్యేను సన్మానించారు. తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. ఆయన వెంట నాయకులు మనోహర్ గౌడ్, భాస్కర్, రాజు, సామర్ల తిరుపతి, జాడి దిగంబర్, నీలేష్ తదితరులు పాల్గొన్నారు.