దండేపల్లి : రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం దండేపల్లి మండలంలోని మ్యాదరిపేటలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని (Medical Camp )మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారికి వైద్యచికిత్సలు ఉచితంగా అందించేందకు నిర్వహిస్తున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు మంచిర్యాల అసెంబ్లీ లోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయనున్నామని వివరించారు. రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, నాయకులు మోటపలుకుల గురువయ్య, గాజుల ముఖేష్ గౌడ్, డంకా లక్ష్మణ్, పిట్టల అశోక్, బెడద సురేష్, ఎంబడి సురేందర్, పత్తిపాక సంతోష్, బత్తుల శేఖర్, ముత్తినేని మల్లేష్, నలిమెల మహేష్, బోడకుంటి వెంకటేష్, ముత్తె అనిల్, పతిపాక శ్రీనివాస్, ముత్తె వెంకటేష్, వనపర్తి రాకేష్ , తదితరులు పాల్గొన్నారు.