బాల్కొండ : జాతీయ అంధత్వ నివారణ సంస్థ, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో శనివారం బాల్కొండ కస్తూర్బా పాఠశాలలో ( Kasturba School ) విద్యార్థులకు కంటి పరీక్షలు ( Eye Test ) నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కంటి సమస్యలను గుర్తించేందుకు ప్రతి గ్రామానికి వెళ్లి నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు( Doctors ) , ఫార్మసిస్టులు ( Pharmacist ) , ఏఎన్ఎం (ANM) ఉన్నారని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ (తెలిపారు. దృష్టిలోపం, కంటి సమస్యలు న్నట్లు గుర్తించిన విద్యార్థులందరికీ మరోసారి కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు గురురాజ్, మెడికల్ ఆఫీసర్ సూర్య నారాయణ, ఎఎన్ఎం స్వరూప రాణి, ఎస్వో భవాని తదితరులు పాల్గొన్నారు.